ఇటీవల ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిపాలయ్యాను: ఇలియానా

Ileana says she was hospitalized
  • చేతికి సెలైన్ తో ఇలియానా
  • డాక్టర్లు చికిత్స చేశారని వెల్లడి
  • ఒక్క రోజులో ఎంత తేడా అంటూ పోస్టు
స్లిమ్ బ్యూటీ ఇలియానా తన ఆరోగ్య పరిస్థితిపై ఆసక్తికర విషయం వెల్లడించింది. ఆసుపత్రి బెడ్ పై చేతికి సెలైన్ తో ఉన్నప్పటి ఫొటోను పంచుకుంది. ఇటీవల తాను అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరానని ఇలియానా తెలిపింది. డాక్టర్లు తనకు మూడు బ్యాగుల ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించారని వివరించింది. ఒక్క రోజులో ఎంత తేడా! అంటూ ఈ బక్కపలుచని భామ ఇన్ స్టాగ్రామ్ లో పేర్కొంది. 

తన ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతూ, సందేశాలు పంపుతున్న ప్రతి ఒక్క అభిమానికి కృతజ్ఞతలు అని వెల్లడించింది. సకాలంలో వైద్యసాయం అందుకున్నానని, ఇప్పుడు తాను బాగానే ఉన్నానని, అభిమానులు తన పట్ల చూపుతున్న ఆదరణకు నిజంగా ముగ్ధురాలినయ్యానని వివరించింది.
Go Back to Shorts
Ileana
Hospital
Illness
Instagram

More Telugu News