టీడీపీ అధికారంలోకి వస్తే ఇద్దరు నానిలు దేశం విడిచి పారిపోతారు: దేవినేని ఉమ
- తాడేపల్లి పెద్దల ఆదేశాలతోనే విజయ్ పై కేసు పెట్టారన్న దేవినేని ఉమ
- కేసు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని విమర్శ
- సజ్జల మాట విన్న గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలని వ్యాఖ్య
సజ్జల మాటవిన్న గౌతమ్ సవాంగ్, ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏమయ్యారో చూడాలని చెప్పారు. దోచుకున్న డబ్బును కాపాడుకునేందుకు కొడాలి నాని, పేర్ని నానిలు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం చూసేందుకు బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు నానిలు హైదరాబాద్ లో దాక్కున్నారని... ఇప్పుడు మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తే దేశం విడిచి పారిపోతారని వ్యాఖ్యానించారు.