టీ20 క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. లక్నో మ్యాచ్‌లో ఒక్క సిక్సరూ నమోదు కాలేదు!
- 100 పరుగుల లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆపసోపాలు పడిన టీమిండియా
- ఒక్క బంతి మిగిలి ఉండగా విజయం
- మ్యాచ్‌లో 14 ఫోర్లు మాత్రమే నమోదు
- భారత గడ్డపై ఒక్క సిక్సర్ కూడా నమోదుకాని మ్యాచ్‌గా రికార్డు
ఈ మ్యాచ్‌లో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఒక్క సిక్సర్ కూడా ఈ మ్యాచ్‌లో నమోదు కాలేదు. బౌలర్లకు సహకరించిన పిచ్‌పై పరుగులు చేయడానికే ఇబ్బంది పడిన బ్యాటర్లు బ్యాట్‌ను ఝళిపించలేకపోయారు. అడపా దడపా ఫోర్లతోనే సరిపెట్టుకున్నారు. భారత గడ్డపై జరిగిన మ్యాచ్‌లో ఒక్క సిక్సర్ కూడా నమోదు కాకపోవడం ఇదే తొలిసారి. ఫోర్లు కూడా అతి స్వల్పంగా 14 మాత్రమే వచ్చాయి. కివీస్ జట్టు ఆరు ఫోర్లు కొట్టగా, భారత జట్టు 8 ఫోర్లు బాదింది.