Kotamreddy Sridhar Reddy: సొంత ఖర్చుతో ప్రజలకు ‘ఆరోగ్య రక్ష’.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమం

Kotamreddy Sridhar Reddy starts Arogya Raksha programme
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. తాజాగా ఆయన చేపట్టిన ఓ కార్యక్రమం సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంతో సంబంధం లేకుండా తన సొంత ఖర్చులతో ప్రజలకు వైద్య సేవలను అందించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. ఈ కార్యక్రమానికి 'ఆరోగ్య రక్ష' అని ఆయన పేరు పెట్టారు. ప్రభుత్వ పథకం ఆరోగ్యశ్రీ ఉండగా... ఆయన ఆరోగ్య రక్ష పేరుతో సొంత కార్యక్రమాన్ని ఆసక్తికరంగా మారింది. 

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ వల్ల కొందరికి మాత్రమే లబ్ధి చేకూరుతోందని... తన కార్యక్రమం ద్వారా అన్ని రకాల వ్యాధులకు చికిత్స, మందులు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం కోసం కొందరు కార్పొరేట్ ఆసుపత్రులు, నిపుణులైన డాక్టర్ల సాయం తీసుకుంటున్నామని తెలిపారు. నెల్లూరులోని 6 ఆసుపత్రులకు చెందిన 33 మంది వైద్యులు, రెండు సామాజిక సేవా సంస్థలు భాగస్వాములు అయ్యాయని చెప్పారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనేదే తన లక్ష్యమని, ఈ కార్యక్రమం ద్వారా తాను ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించడం లేదని తెలిపారు.
Go Back to Shorts
Kotamreddy Sridhar Reddy
YSRCP
Arogya Raksha

More Telugu News