Sukesh Chandrashekhar: తీహార్ జైలుకి పిలిపించుకొని సుఖేష్ నాకు ప్రపోజ్ చేశాడు: టీవీ నటి చాహత్ ఖన్నా

Chahatt Khanna says Sukesh Chandrashekhar proposed to her in Tihar jail
  • అభిమానినని చెప్పి జైలుకి పిలిపించుకున్నాడన్న చాహత్ ఖన్నా
  • తాను జయలలిత మేనల్లుడినని సుఖేష్ చెప్పాడని వెల్లడి
  • మనీలాండరింగ్ కేసులో ఈడీ సమన్లు అందుకున్న చాహత్  
తనని ట్రాప్ చేసి తీహార్ జైలుకు పిలిపించుకున్న ఆర్థిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌ మోకాళ్లపై నిల్చొని తనకు ప్రపోజ్ చేశాడని హిందీ టీవీ నటి చాహత్ ఖన్నా చెప్పింది. తనకు పెళ్లయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెబితే.. తన భర్త తనకు సరైన వ్యక్తి కాదన్నాడని తెలిపింది. ఆ సమయంలో తనకు ప్రపోజ్ చేస్తున్నది సుఖేష్ అని తనకు తెలుసని వెల్లడించింది. 

అయితే తాను దివంగత జయలలిత మేనల్లుడిని, ఒక ప్రముఖ దక్షిణ భారత టీవీ ఛానెల్ యజమానిని కలుస్తున్నానని అనుకున్నానని చాహత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. మనీలాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్, బాలీవుడ్ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీపై విచారణ కొనసాగుతోంది. ఫిబ్రవరి 15న కోర్టులో తదుపరి విచారణకు రానుంది. జైల్లో సుఖేష్ ను కలిసిన కారణంగా ఈ కేసులో చాహత్ ఖన్నా కూడా సమన్లు అందుకుంది.
 
సుఖేష్‌తో సమావేశం గురించి ఆమె మాట్లాడుతూ ‘నేను జైల్లో కలిసినప్పుడు సుఖేష్ ఫ్యాన్సీ షర్ట్‌, బంగారు గొలుసు ధరించి ఉన్నాడు. తనను తాను ఒక ప్రముఖ దక్షిణ భారత టీవీ ఛానెల్ యజమాని, జయలలిత మేనల్లుడునని పరిచయం చేసుకున్నాడు. నాకు అభిమానిని అని, నా టీవీ షో బడే అచ్చే లాగ్తే హైని చూశానన్నాడు. నన్ను కలవాలనుకుంటున్నానని చెప్పాడు. దాంతో నేను కంగారు పడ్డారు. నన్ను ఇక్కడికి ఎందుకు పిలించారు? ఆరునెలల పాపను ఇంట్లో వదిలేసి, ఇదో ఈవెంట్ అనుకుని ఇక్కడికి వచ్చాను అని అతనితో చెప్పా. ఈలోపే సుఖేష్ మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. నేను గట్టిగా అరిచా. నాకు పెళ్లైంది, ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పా. కానీ అతను నా భర్త నాకు సరైన వ్యక్తి కాదని, నా పిల్లలకు తండ్రి మాత్రమే అవుతాడని చెప్పాడు. నేను చాలా ఆందోళన చెందాను. నేను ఏడవడం మొదలుపెట్టా’ అని చాహత్ చెప్పుకొచ్చింది.
Sukesh Chandrashekhar
tihar jail
actress
Chahatt Khanna

More Telugu News