ప్రియురాలితో డాక్టర్ బ్రేకప్.. డిప్రెషన్ లో బెంజ్ కారుకు నిప్పు
- తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఘటన
- కారులో కూర్చుని ఆత్మహత్యకు యత్నించినట్లు భావిస్తున్న పోలీసులు
- ఊపిరాడకపోవడంతో బయటికి వచ్చేశాడని వెల్లడి
నిప్పు పెట్టిన తర్వాత తాను కారు లోపలికి వెళ్లి ఆత్మహత్య చేసుకోవాలని సదరు డాక్టర్ ప్రయత్నించినట్లుగా అనుమానిస్తున్నారు. ‘‘గతంలో తన ప్రియురాలితో అతడు గడిపిన చోటు దగ్గరే ఈ ఘటన జరిగింది. కారు కాలిపోతున్నా.. లోపలే కొద్ది సేపు ఉన్నాడు. కానీ ఊపిరి ఆడకపోవడంతో బయటికి వచ్చేశాడు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారమిచ్చారు. కానీ అప్పటికే కారు మొత్తం కాలిపోయింది’’ అని ఓ పోలీస్ ఆఫీసర్ చెప్పారు.
అతడి ప్రియురాలి గురించి తాము ఆరా తీశామని, ఆమె క్షేమంగానే ఉన్నట్లు తెలిసిందని పోలీసులు వెల్లడించారు. ఘటన జరిగినప్పుడు ఆమె అతడితో లేదని చెప్పారు.