లండన్ లో ఇంటి అద్దె నెలకు రూ.2.5 లక్షలు
- లండన్ లో రికార్డు స్థాయికి పెరిగిన అద్దెలు
- నగరం నడిబొడ్డున ఉన్న ఇంటికి నెలకు రూ. 3 లక్షలు చెల్లించాల్సిందే..
- అద్దె విపరీతంగా పెంచేసిన ఇంటి యజమానులు
- ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలతో సతమతమవుతున్న ప్రజలు
ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెరగగా ఇంటద్దె పెంపుతో మధ్యతరగతి ప్రజలకు కష్టాలు తప్పట్లేదని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. టెలిగ్రాఫ్ డైలీ కథనం ప్రకారం.. లండన్ లో కిందటేడాది చివరి నాలుగు నెలల్లో ఇళ్ల అద్దెలు సగటున రూ. 2.50 లక్షలకు చేరాయి. లండన్ నడిబొడ్డున ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే నెలనెలా రూ. 3 లక్షలు చెల్లించాల్సిందేనని ఈ రిపోర్టు వెల్లడించింది. ధరలు ఈ స్థాయికి పెరగడం చరిత్రలోనే ఇదే తొలిసారి అని వివరించింది.