పవర్ స్టార్ ఎలా అయ్యావనే బాలయ్య ప్రశ్నకి పవన్ ఏం చెప్పాడు?

బాలయ్య వ్యాఖ్యాతగా కొనసాగుతున్న 'అన్ స్టాపబుల్ 2' ఒక రేంజ్ లో దూసుకెళుతోంది. ఈ టాక్ షోలో పవన్ కల్యాణ్ పాల్గొన్న ఎపిసోడ్ గురించి ఆయన అభిమానులతో పాటు అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అనే ఆత్రుతలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టు1కి సంబంధించిన ఎపిసోడ్ ను ఫిబ్రవరి 3వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టుగా చెబుతూ, 'ఆహా' నుంచి ప్రోమోను వదిలారు.

ఈ ప్రోమో ఇప్పుడు ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతోంది. పవన్ కల్యాణ్ కి గ్రాండ్ ఎంట్రీని ప్లాన్ చేశారనే విషయం ఈ ప్రోమో చూస్తేనే అర్థమైపోతోంది. బాలయ్య ప్రశ్నలకు పవన్ స్పందిస్తూ, తాను .. త్రివిక్రమ్ ఫ్రెండ్స్ కావలసి వచ్చిందనీ .. అన్నయ్యలిద్దరూ బిజీగా ఉండటం వలన చరణ్ ను తాను చూసుకోవలసి వచ్చేదనీ, ఇంట్లో  ఉండటం వలన దొరికిపోయేవాడినని అన్నారు.

"అమ్మంటే భయమా .. భార్య ఆంటే భయమా? .. ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా? ఇంతటి మానసిక సంఘర్షణకి గురైన పవన్ కల్యాణ్ .. పవర్ స్టార్ ఎలా అయ్యాడు? అంటూ బాలయ్య వరుస ప్రశ్నలు సంధించాడు. అప్పుడు పవన్ ఏమని సమాధానమిచ్చాడనేది ఈ ఎపిసోడ్ కి హైలైట్ గా నిలవనున్నాయి. ఆ విషయాలు తెలియాలంటే ఫిబ్రవరి 3వ తేదీవరకూ వెయిట్ చేయవలసిందే.


More Telugu News