తారకరత్న కోలుకుంటున్నాడు.. బెంగళూరుకు తరలిస్తున్నాం: బాలకృష్ణ
- ఉదయం గుండెపోటుకు గురైన తారకరత్న
- మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తున్నామన్న బాలకృష్ణ
- రోడ్డు మార్గంలో అంబులెన్సులో తరలించనున్నట్టు వెల్లడి
కుప్పంలోని డాక్టర్లు మంచి చికిత్స చేశారని... ఆయనను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకుగాని, మరెక్కడికైనా తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారని... తాము బెంగళూరుకు తరలిస్తున్నామని బాలయ్య చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేద్దామని అనుకున్నప్పటికీ, వాటిలో సరైన వైద్య పరికరాలు ఉండవని... అందువల్ల రోడ్డు మార్గంలో అంబులెన్సులో తీసుకెళ్లాలని నిర్ణయించామని తెలిపారు. ఆయన తాత ఎన్టీఆర్ గారు, నానమ్మగారి ఆశీర్వాదాలు, భార్య మాంగల్య బలం, అభిమానుల ప్రార్థనల వల్ల ప్రాణాపాయం లేదని చెప్పారు. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబుగారు ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారని చెప్పారు.