గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్పై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత
- రిపబ్లిక్ డే ప్రసంగంలో సీఎం కేసీఆర్ పై గవర్నర్ పరోక్ష విమర్శలు
- కొందరికి ఫామ్ హౌస్ లు ఉండటం కాదు.. అందరికీ ఇళ్లు ఉండాలన్న గవర్నర్
- అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని విమర్శ
కేవలం కొందరి సంపదను పెంచడంపై కాకుండా... రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవాలనే ఉద్దేశంతోనే కేంద్రంపై తాము పోరాడుతున్నామని చెప్పారు. ఎప్పటి నుంచో కేసీఆర్ ప్రశ్నిస్తున్న వాటినే ఈరోజు గవర్నర్ ప్రస్తావించారని... ఆమెకు ధన్యవాదాలు తెలుపుతున్నామని ఎద్దేవా చేశారు.
ఈరోజు గవర్నర్ మాట్లాడుతూ... కొందరికి ఫామ్ హౌసులు ఉండటం కాదని... అందరికీ నివసించడానికి ఇళ్లు ఉండాలని అన్నారు. అభివృద్ధి అంటే కొత్త బిల్డింగులు కట్టడం కాదని... దేశాన్ని నిర్మించడమని చెప్పారు. జాతీయ రహదారులు, వందేభారత్ తదితర అంశాలకు సంబంధించి ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు.