కాబోయే భార్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంత్ అంబానీ

  • స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
  • ఇటీవలే అనంత్, రాధికా మర్చంట్ నిశ్చితార్ధం    
  • పెళ్లికి ముందు తిరుమల దర్శనానికి వచ్చిన వైనం
భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ సంస్థల అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాబోయే భార్య రాధికా మర్చంట్‌తో కలిసి స్వామి వారి అర్చన సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంత్, రాధికకు ఆలయ రంగనాయకుల మండపం వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి ముందు తిరుమల దర్శనానికి వచ్చారు.

Reliance
Mukesh Ambani
ananth ambani
tirumala
radhika

More Telugu News