రోజుకు 8 నిమిషాల పనికి ఏడాదికి రూ. 40 లక్షల జీతం ఇస్తున్నారు: ఐఏఎస్ అధికారి ఖేమ్కా
- ఇప్పటి వరకు 56 సార్లు బదిలీ అయిన అశోక్ ఖేమ్కా
- ప్రస్తుతం హర్యానా ఆర్కైవ్స్ శాఖలో ఉద్యోగం
- తనకు వారానికి గంటకు మించి పని లేదని ఆవేదన
ఇక తన డిపార్ట్ మెంట్ లో తనకు వారానికి గంటకు మించి పని లేదని అన్నారు. మరోవైపు కొందరు అధికారులకు తలకు మించిన పని ఉందని చెప్పారు. కొందరికి పని లేకపోవడం.. మరికొందరికి విపరీతంగా పని ఉండటం వల్ల ప్రజా ప్రయోజనాలు నెరవేరవని అన్నారు. అవినీతి క్యాన్సర్ ను వదిలించాలనే తాను తన కెరీర్ ను పణంగా పెట్టానని... ఈ విషయంలో విజిలెన్స్ విభాగం ముఖ్యమయినదని... కెరీర్ చివర్లో ఉన్న తాను ఈ విభాగంలో సేవలను అందించాలనుకుంటున్నానని చెప్పారు. తనకు అవకాశమిస్తే... అతినీతిపై నిజమైన యుద్ధం చేస్తానని హామీ ఇస్తున్నానని అన్నారు.