వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు: మాజీ మంత్రి బాలినేని
- సింగరాయకొండ మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణస్వీకారం
- హాజరైన బాలినేని శ్రీనివాసరెడ్డి
- ఈసారి తన భార్యకు టికెట్ ఇవ్వొచ్చని వ్యాఖ్యలు
- మహిళలకు టికెట్ ఇస్తుంటే తప్పుకోక తప్పదని వెల్లడి
కొండపి నియోజకవర్గంలో అశోక్ బాబు అందరినీ కలుపుకుని వెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ నేతలు పార్టీ గెలుపు కోసం పనిచేయాలని స్పష్టం చేశారు. కొండపి నియోజకవర్గం సింగరాయకొండలో మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో బాలినేని కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.