అమెరికాలో టెన్షన్ లో భారత ఐటీ నిపుణులు
- భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న కంపెనీలు
- ఉద్యోగాలను కోల్పోయిన 2 లక్షల మంది ఐటీ నిపుణులు
- 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోకపోతే ఇండియాకు రావాల్సిందే
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం గత నవంబర్ మాసం నుంచి దాదాపు 2 లక్షల మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలను కోల్పోయారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులే అనేది ఒక అంచనా. వీరిలో ఎక్కువ మంది హెచ్ 1బీ, ఎల్1 వీసాలపై వెళ్లినవారు ఉన్నారు. హెచ్1బీ వీసాపై వెళ్లినవారు 60 రోజుల్లో కొత్త జాబ్ ను వెతుక్కోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఇండియాకు తిరిగిరావడం మినహా వారికి మరో మార్గం ఉండదు. ప్రస్తుతం అమెరికాలో భారీగా లేఆఫ్ లు చోటుచేసుకుంటున్న తరుణంలో... వీరు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కష్టమనే చెప్పుకోవాలి.