కేరళలో ఘోర ప్రమాదం.. ఐదుగురు ఇస్రో ఉద్యోగుల మృతి
- అలప్పుజ జిల్లాలో కారును ఢీ కొట్టిన లారీ
- కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత
- మృతులంతా తిరువనంతపురం ఇస్రో క్యాంటిన్ ఉద్యోగులు
- పోలీసుల అదుపులో లారీ డ్రైవర్, క్లీనర్
సోమవారం తెల్లవారుజామున బియ్యం బస్తాల లోడ్ తో ఆంధ్రప్రదేశ్ నుంచి అలప్పుజ వెళుతున్న లారీ ఈ ప్రమాదానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన ఐదుగురూ తిరువనంతపురంలోని ఇస్రో క్యాంటిన్ ఉద్యోగులని వివరించారు. అలప్పుజ నుంచి తిరువనంతపురం వెళుతుండగా వాళ్లు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీ కొట్టిందని వివరించారు. కాగా, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం అలప్పుజ మెడికల్ హాస్పిటల్ కు తరలించామని, ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాఫ్తు జరుపుతామని పోలీసులు వివరించారు.