ప్రీ వెడ్డింగ్ షూట్‌కు వెళ్తుండగా ప్రమాదం.. నలుగురి దుర్మరణం
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
- ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల సమీపంలో ప్రమాదం
- బాధితులను హనుమకొండ, వరంగల్ జిల్లాలకు చెందిన వారిగా గుర్తింపు
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన రణధీర్‌ను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివగా గుర్తించారు. ప్రీవెడ్డింగ్ షూట్ కోసం అందరూ కలిసి మోతే వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.