Novak Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మూడో రౌండ్ కు దూసుకెళ్లిన జకోవిచ్

Novak Djokovic enters into third round in Australian Open
షార్ట్స్‌లో చూడండి
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మూడో రౌండ్ లో ప్రవేశించాడు. నేడు జరిగిన రెండో రౌండ్ పోరులో జకోవిచ్ 6-1, 6-7, 6-2, 6-0తో ఫ్రాన్స్ కు చెందిన ఎంజో కౌకాడ్ పై విజయం సాధించాడు. తొలి సెట్ ను అలవోకగా గెలిచిన జకో... రెండో సెట్ లో కౌకాడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఆ సెట్ టైబ్రేకర్ కు దారితీయగా 5-7తో జకోవిచ్ కోల్పోయాడు. అయితే, ఆ తర్వాత వరుసగా రెండు సెట్లు చేజిక్కించుకున్న ఈ వరల్డ్ మాజీ నెంబర్ వన్ మ్యాచ్ ను తన వశం చేసుకున్నాడు. 

ఇక, పురుషుల సింగిల్స్ లో ఓ మోస్తరు సంచలనం నమోదైంది. 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ను అమెరికాకు చెందిన మైకేల్ ఎమ్మో ఇంటిదారి పట్టించాడు. 3 గంటల 26 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్ లో ఎమ్మో 6-7, 6-4, 6-3, 6-2తో జ్వెరెవ్ పై నెగ్గాడు. 

మహిళల సింగిల్స్ లో రెండో సీడ్ ఆన్స్ జాబెర్ కు చుక్కెదురైంది. మార్కెటా వాండ్రసోవాతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ లో ఆన్స్ జాబెర్ 1-6, 7-5, 1-6తో ఓటమిపాలైంది. 

అటు, మహిళల డబుల్స్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా శుభారంభం చేసింది. ఇవాళ జరిగిన తొలి రౌండ్ పోరులో సానియా కజకిస్థాన్ క్రీడాకారిణి డానిలినాతో కలిసి బరిలో దిగింది. సానియా-డానిలినా జోడీ 6-2, 7-5తో గాల్ఫీ-పెరా ద్వయంపై విజయం సాధించి రెండో రౌండ్ లో ప్రవేశించింది.
Go Back to Shorts
Novak Djokovic
Third Round
Australian Open
Tennis
Grandslam

More Telugu News