ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతా: గవర్నర్ తమిళిసై

Governor Tamilisai reacts to criticism
  • బీఆర్ఎస్ సర్కార్ వర్సెస్ తమిళిసై
  • గత కొన్నాళ్లుగా మాటల యుద్ధం
  • గవర్నర్ పదవిని కేసీఆర్ అవమానించారన్న తమిళిసై
  • ఎలా అవహేళన చేస్తారంటూ ఆగ్రహం
  • తనకు ప్రోటోకాల్ తెలుసని స్పష్టీకరణ
గత కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల గవర్నర్ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవిని సీఎం కేసీఆర్ అవమానించారని తమిళిసై ఆగ్రహం వెలిబుచ్చారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు.  

తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తనకు ప్రోటోకాల్ తెలుసని తమిళిసై అన్నారు. ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతానని స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే అంశంపై తనకు సమాచారం లేదని ఆమె తెలిపారు.
Go Back to Shorts
Tamilisai Soundararajan
KCR
BRS
Protocol

More Telugu News