లోకేశ్ ను కలిసి పాదయాత్రకు మద్దతు తెలిపిన టీడీపీ నేతలు
- ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ
- ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభం కానున్న ‘యువగళం’ యాత్ర
- పాదయాత్ర వివరాలపై నేతలతో చర్చించిన టీడీపీ జాతీయ కార్యదర్శి
ఈ నేపథ్యంలో మంగళవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసానికి మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నిమ్మకాయల చిన రాజప్ప, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తదితర నేతలు చేరుకున్నారు. లోకేశ్ ను కలిసి యువగళం యాత్రకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారితో సమావేశమైన లోకేశ్.. ఈ నెల 27న కుప్పం నుంచి ప్రారంభించనున్న యువగళం యాత్ర ఏర్పాట్లపై వారితో చర్చించారు. పార్టీ కార్యకర్తలు, నేతల మద్దతుతో.. ప్రజల్లో చైతన్యం తెచ్చేలా యువగళం పాదయాత్ర నిర్వహిస్తానని లోకేశ్ వారికి తెలిపారు.
