నేపాల్ విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం
- మృతుల్లో ఐదుగురు భారతీయులు
- 72 మందితో కూడిన విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం
- రన్ వే పై విమానం కుప్పకూలడంతో భారీగా ప్రాణ నష్టం
మృతుల్లో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియా, ఒకరు ఐర్లాండ్ కు చెందిన వారిగా గుర్తించారు. మిగతా వాళ్లు నేపాల్ కు చెందిన వాళ్లు అని తెలుస్తోంది.
యతి ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం రన్ వే పై కూలిపోవడంతో ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన వాళ్లను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కాగా, ఈ ఘటనపై నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.