సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న సీఎం జగన్... ఫొటోలు ఇవిగో!
- నేడు భోగి
- సీఎం క్యాంపు కార్యాలయం వద్ద గోశాలలో సంక్రాంతి సంబరాలు
- సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్
ఈ సందర్భంగా గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భోగిమంటలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండివంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల నృత్యాలతో గోశాల కళకళకలాడింది. సంక్రాంతి సంబరాలను సీఎం జగన్, భారతి దంపతులు ఉత్సాహంగా తిలకించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.

