తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- రేపు భోగి, ఎల్లుండి సంక్రాంతి
- అచ్చ తెలుగు పండుగ అని పేర్కొన్న సీఎం జగన్
- ప్రతి ఒక్కరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్ష
భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలిపటాల కోలాహలం, కళకళలాడే పచ్చనిపైర్లు గ్రామాలకు సంక్రాంతి శోభను తీసుకువస్తాయని పేర్కొన్నారు.
ఈ మకర సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో అభివృద్ధితో కూడిన మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటిలోనూ ఆనందాల సిరులు వెల్లివిరియాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.