Aravinda Krishna: ఆసక్తిని రేపుతున్న 'అండర్ వరల్డ్ బిలియనీర్స్' ఫస్ట్ లుక్ రిలీజ్!

  • డిఫరెంట్ కాన్సెప్టుతో 'అండర్ వరల్డ్ బిలియనీర్స్'
  • యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్ 
  • హీరోగా అరవింద కృష్ణ   
  • హీరోయిన్స్ గా రాధిక - ప్రీతి పరిచయం
  • త్వరలోనే రానున్న రిలీజ్ డేట్
Under World Billionires

అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సిరీస్ 'అండర్ వరల్డ్ బిలియనీర్స్'. వైవిధ్యభరితమైన సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరో, తాజాగా మరొక ఆసక్తికరమైన వెబ్ సిరీస్ చేశాడు. గగన్ గోపాల్ ముల్క దర్శకత్వం వహించిన ఈ సీరీస్ ను, ఎల్.ఎస్.ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎల్. శ్రీనివాసులు - దీవి వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. 

యాక్షన్ థ్రిల్లర్ గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ లుక్ సిరీస్ పై మంచి అంచనాలు పెంచుతోంది. రాధిక - ప్రీతి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సీరీస్ లో మధు సూధన్ .. జ్యోతి రాయ్ .. షవర్ అలీ .. అలోక్ జైన్ .. లీనా కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ షూటింగు పార్టును పూర్తిచేసుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సిరీస్ విడుదల తేదీని ప్రకటించనున్నారు. చిన్నా అందించిన సంగీతంతో పాటు, సురేంద్ర రెడ్డి ఫొటోగ్రఫీ ఈ వెబ్ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు..

More Telugu News