ధమాకా ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
- డిసెంబర్ 23న విడుదలైన చిత్రం
- రూ. 100 కోట్ల కలెక్షన్లతో రవితేజ ఖాతాలో భారీ విజయం
- ఈ నెల 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి
త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించగా, బెజవాడ ప్రసన్నకుమార్ రచయితగా వ్యవహరించారు. భీమ్స్ సిసిరోలియో అదిరిపోయే సంగీతం అందించగా, కార్తిక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్‌గా పని చేశారు. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కరిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. ‘ధమాకా’ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీ మొత్తంతో హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ జనవరి 22 నుంచి సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.