Balakrishna: 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న 'వీరసింహారెడ్డి' డైరెక్టర్!

Unstoppable 2 Update
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్ వారు 'వీరసింహా రెడ్డి' సినిమాను నిర్మించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో కథానాయికగా శ్రుతి హాసన్ నటించగా, మరో ముఖ్యమైన పాత్ర ద్వారా హనీరోజ్ పరిచయమవుతోంది. ఇక ప్రతినాయకుడిగా దునియా విజయ్ నటించగా. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించనుంది. 

సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన ఈ సినిమా టీమ్ 'అన్ స్టాపబుల్ 2' వేదికపై సందడి చేయనుంది. అందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం రన్ అవుతోంది. 'నేను చాలా హైపర్ .. మీరు నాకంటే ఎక్కువ హైపర్' అని బాలయ్యతో అంటూ వరలక్ష్మి నవ్వేసింది. 

'మొత్తానికి ఈ సినిమాలో డబుల్ రోల్ పెట్టి, నన్ను బాగా వాడేసుకున్నావ్' అని బాలయ్య అంటే నవ్వేసిన గోపీచంద్ మలినేని, 'క్రాక్' హిట్ కి ముందు చాలా స్ట్రగుల్ ఫేస్ చేశావట, ప్రాపర్టీస్ కూడా అమ్మేసుకున్నావ్. ఆ సమయంలో ఎలా అనిపించింది?' అని బాలయ్య అడిగితే, కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకు ఆయన చెప్పిన సమాధానం ఏమిటనేది 13వ తేదీన చూడాల్సిందే.
Go Back to Shorts
Balakrishna
Varalakshmi Sharath Kumar
Duniya Vijay
Veerasimha Reddy Movie

More Telugu News