మిర్చి రైతులకు 'నల్ల తామర' కష్టాలు.. వ్యవసాయ శాఖ స్పందించాలి: చంద్రబాబు
- పంటను కాపాడుకోవడానికి సూచనలు చేయాలని కోరిన టీడీపీ అధినేత
- ఈ తెగులు కారణంగా గతేడాది రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన
- గతేడాది తెలుగు రాష్ట్రాలు సహా ఆరు రాష్ట్రాల్లోని వందలాది ఎకరాల్లో పంట నష్టం
నల్ల తామర పురుగు నుంచి మిర్చి పంటను కాపాడుకునేందుకు రైతులు రకరకాల మందులు వాడడంతో పెట్టుబడి రెట్టింపు అవుతోందని వివరించారు. పురుగుమందుల ధరల నియంత్రణపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. తామర పురుగు నుంచి పంటను కాపాడుకోవడానికి మిర్చి రైతులకు తగిన సూచనలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులకు చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
బ్లాక్ త్రిప్స్ గా వ్యవహరించే కొత్త రకం పురుగే ఈ నల్ల తామర.. గతేడాది తెలుగు రాష్ట్రాలతో పాటు ఆరు రాష్ట్రాల్లోని 34 జిల్లాల్లో వేసిన మిర్చి పంటను నాశనం చేసింది. రైతులను తీవ్రంగా నష్టపరిచిందని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ ఆర్) నిపుణులు చెప్పారు. 2015లో తొలిసారి ఈ నల్ల తామర పురుగును గుర్తించినట్లు చెప్పారు. 2018-19 కాలంలో కర్ణాటకలోని అలంకరణ మొక్కలకు సోకిందని, 2021లో తొలిసారి మిర్చిపంటను ఈ పురుగు ఆశించిందని వివరించారు.