కశ్మీర్ లో లోయలో పడి ముగ్గురు సైనికుల మృతి

3 Indian Army personnel die after falling into a deep gorge in Kupwara
  • చనిపోయిన వాళ్లలో ఒక జేసీవో, ఇద్దరు జవాన్లు
  • మృతదేహాలను వెలికి తీసిన అధికారులు
  • మంచు పెళ్లలు విరిగిపడడంతో ప్రమాదం
జమ్మూ కశ్మీర్ లో దారుణం చోటుచేసుకుంది. విధుల్లో భాగంగా గస్తీ కాస్తున్న ముగ్గురు సైనికులు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారు. దీంతో ఆ ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. నార్త్ కశ్మీర్ లోని కుప్వారాలో 14వ బెటాలియన్ కు చెందిన ఒక అధికారి, ఇద్దరు జవాన్లు ఈ ప్రమాదంలో చనిపోయారు. ఫార్వార్డ్ ఏరియాలో ఈ ముగ్గురూ విధులు నిర్వహిస్తుండగా మంచు పెళ్లలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు. 

దీంతో పట్టుతప్పి వాళ్లు ముగ్గురూ లోయలో పడిపోయారని చెప్పారు. వారికోసం గాలింపు చేపట్టగా.. ముగ్గురి మృతదేహాలు దొరికాయని చీనార్ కోర్ కు చెందిన అధికారులు వివరించారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికులు, అధికారి ఎవరనే వివరాలను ఆర్మీ అధికారులు వెల్లడించలేదు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని, పూర్తి వివరాలతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
Go Back to Shorts
kashmir
soldiers
gorge
kupwara
army

More Telugu News