‘కాంతార’ ఖాతాలో మరో ఘనత.. ఆస్కార్ బరిలో నిలిచిన సినిమా
- బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ విభాగాల్లో నామినేట్ అయిందన్న నిర్మాణ సంస్థ
- రూ.16 కోట్లతో తీసిన ఈ సినిమా వసూళ్లు ఏకంగా రూ.450 కోట్లు
- ప్రస్తుతం సీక్వెల్ తీసే ఏర్పాట్లలో బిజీగా ఉన్న రిషబ్ శెట్టి
కాంతార సినిమా ఆస్కార్ కు నామినేట్ అయిందని సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్స్ ప్రకటించింది. రెండు విభాగాల్లో ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. బెస్ట్ మూవీ అవార్డు విభాగంతో పాటు బెస్ట్ యాక్టర్ విభాగంలో నామినేట్ అయిందని తెలిపింది. కన్నడిగుల సంప్రదాయ భూతకోల నేపథ్యంలో దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఆయన హీరోగానూ నటించారు. క్లైమాక్స్ లో చివరి 20 నిమిషాలపాటు ప్రతీ సన్నివేశం కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కాగా, కాంతార సినిమాకు సీక్వెల్ తీస్తామని గతంలోనే ప్రకటించిన హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి.. ప్రస్తుతం షూటింగ్ ఏర్పాట్లలో ఉన్నట్లు సమాచారం.