దుబాయ్ లో షాపింగ్ చేసిన 27 మంది భారతీయుల ఇంట పసిడి పంట
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో షాపింగ్ చేసి 11 కిలోల బంగారం గెలిచిన 44 మంది
- ఒక్కొక్కరికి పావు కిలో బంగారం బహుమతి
- వీరిలో 27 మంది ప్రవాస భారతీయులు
ఈనెల 29వ తేదీ వరకు షాపింగ్ ఫెస్టివల్ ఉండటంతో మరింత మంది బంగారాన్ని బహుమతిగా గెలుచుకునే అవకాశం ఉంది. ఈ గోల్డ్ లక్కీ డ్రాలో పేరు నమోదు చేసుకొని బంగారం గెలుచుకోవాలనుకునేవాళ్లు షాపింగ్ ఫెస్టివల్ లో 500 దిర్హమ్స్ (రూ.11వేలు), అంతకంటే ఎక్కువ ఖర్చు చేయాలి. అప్పుడు వాళ్లు గోల్డ్ లాటరీకి అర్హులు అవుతారు. కాగా, 46 రోజుల పాటు జరిగే దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ లో అద్భుతమైన షాపింగ్ అనుభూతిని కలిగిస్తోంది. షాపింగ్ తో పాటు థియేట్రికల్ ప్రదర్శనలు, కమ్యూనిటీ మార్కెట్‌లు, జానపద ప్రదర్శనలు, పిల్లల కోసం అనేక ఇతర ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా సందర్శకులను ఆకట్టుకుంటోంది.