ఇప్పుడు గోల్డ్మన్ సాచ్స్ వంతు.. 3,200 మంది ఉద్యోగులపై వేటు!
- ఆర్థిక అస్థిరత, పెరిగిపోతున్న ఖర్చులను తగ్గించుకునే పనిలో కంపెనీలు
- ఈ నెలలోనే ప్రారంభం కానున్న తొలగింపు ప్రక్రియ
- క్షేత్రస్థాయి ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై ప్రభావం
కంపెనీ తాజా నిర్ణయం క్షేత్రస్థాయి ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్లలోని ఉద్యోగులపై పడే అవకాశం ఉందని ‘బ్లూమ్బర్గ్’ తెలిపింది. గోల్డ్మన్ సాచ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ సోలోమన్ మాట్లాడుతూ.. జనవరి తొలి అర్ధభాగం నుంచి ఉద్యోగుల తొలగింపు ఉంటుందన్నారు.