తనపై అత్యాచారం చేసిన నిందితుడి తల్లిపై బాధితురాలు కాల్పులు
- ఢిల్లీలోని భాజన్ పురలో శనివారం సాయంత్రం ఘటన
- ఆ మహిళ కొడుకుపై కక్షతోనేనని పోలీసులకు వెల్లడి
- మహిళను ఆసుపత్రిలో చేర్పించి, నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
భాజన్ పురలో ఉంటున్న ఓ బాలిక కిందటేడాది తనపై అఘాయిత్యం జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. తన ఏరియాలో ఉండే బాలుడు ఒకరు తనపై అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేసింది. బాధితురాలితో పాటు నిందితుడు కూడా మైనర్ కావడంతో పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విచారణ జరిపి, అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని పోలీసులు చెప్పారు. తాజాగా, ఈ కేసులో నిందితుడైన బాలుడి తల్లిపై బాలిక కాల్పులు జరిపింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ మహిళను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.