సిరీస్ ఫలితం తేల్చనున్న చివరి టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss in series decider against Sri Lanka
  • రాజ్ కోట్ వేదికగా మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతున్న భారత్
  • శ్రీలంక జట్టులో ఒక మార్పు
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య నేడు చివరిదైన మూడో టీ20 మ్యాచ్ రాజ్ కోట్ లో జరగనుంది. సిరీస్ ఫలితం తేల్చే ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇరుజట్లు చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ 1-1తో సమమైంది. దాంతో ఈ మ్యాచ్ లో విజయంపై రెండు జట్లు కన్నేశాయి. కాగా, నేటి మ్యాచ్ కోసం టీమిండియాలో ఎలాంటి మార్పులు లేవని కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెల్లడించాడు. గత మ్యాచ్ లో చోటు చేసుకున్న అంశాలను ప్రస్తావించదలుచుకోలేదని, ఇవాళ్టి మ్యాచ్ పైనే దృష్టి సారిస్తున్నామని తెలిపాడు. ఇక శ్రీలంక జట్టులో ఒక మార్పు చోటుచేసుకుంది. భానుక రాజపక్స స్థానంలో ఆవిష్క ఫెర్నాండో తుది జట్టులోకి వచ్చాడు.

టీమిండియా...
హార్దిక్ పాండ్యా (కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్ మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, అక్షర్ పటేల్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, యజువేంద్ర చహల్.

శ్రీలంక...
దసున్ షనక (కెప్టెన్), పత్తుమ్ నిస్సాంక, కుశాల్ మెండిస్, ఆవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంక, వనిందు హసరంగ, చామిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, కసున్ రజిత, దిల్షాన్ మధుశంక.
Go Back to Shorts
Team India
Toss
Sri Lanka
3rd T20
Series
Rajkot

More Telugu News