బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా మరోసారి చేతన్ శర్మ నియామకం
- గత డిసెంబరుతో ముగిసిన సెలెక్షన్ కమిటీ కాలపరిమితి
- దరఖాస్తులు ఆహ్వానించిన బీసీసీఐ
- 600 మంది దరఖాస్తు చేసుకున్న వైనం
- దరఖాస్తులను పరిశీలించిన అడ్వైజరీ కమిటీ
ఇక సెలెక్షన్ కమిటీ సభ్యులుగా శివ్ సుందర్ దాస్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా, శ్రీధరన్ శరత్ నియమితులయ్యారు. సులక్షణా నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) ఈ మేరకు ఖరారు చేసింది.
గత సెలెక్షన్ కమిటీ కాలపరిమితి 2022 డిసెంబరుతో ముగిసింది. గత నవంబరు 18న ఐదుగురు సెలెక్టర్ల పోస్టుల కోసం బోర్డు దరఖాస్తులు ఆహ్వానించగా, 600 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులను వడపోసిన సీఏసీ తాజా నియామకాలు చేపట్టింది.