Samantha: 'శాకుంతలం' ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఇదే!

  • గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం'
  • టైటిల్ రోల్ పోషించిన సమంత 
  • ఈ నెల 9వ తేదీన ట్రైలర్ రిలీజ్ 
  • వచ్చేనెల 17వ తేదీన సినిమా విడుదల
Sakunthalamb Trailar Release Date Confirmed

'శాకుంతలం' ఒక ప్రేమకథా కావ్యం .. ప్రకృతితో ముడిపడిన అందమైన దృశ్యకావ్యం. ఆ కథతో దర్శకుడు గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాను రూపొందించారు. ఈ సినిమాకి ఆయనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. టైటిల్ రోల్ ను సమంత పోషించగా, ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది.

కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్టు టీమ్ ప్రకటించింది. ఈ నెల 9వ తేదీన 12:06 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఎనౌన్స్ మెంట్ పోస్టర్ ను వదిలారు. 

ఈ సినిమాను గుణశేఖర్ ఎంత మనోహరంగా మలిచాడనేది ఈ పోస్టర్ చూస్తేనే అర్థమైపోతోంది. ఫిబ్రవరి 17వ తేదీన ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో దేవ్ మోహన్ .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

More Telugu News