రేపు 'వాల్తేరు వీరయ్య' ట్రైలర్ విడుదల
- మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'వాల్తేరు వీరయ్య'
- బాబీ దర్శకత్వంలో చిత్రం
- జనవరి 13న రిలీజ్
- ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి
బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ 'వాల్తేరు వీరయ్య' చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ నటించగా, రవితేజ, కేథరిన్ ట్రెసా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్టయ్యాయి. ఇక, రేపు విడుదలయ్యే ట్రైలర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.