సత్తా ఉండదు కానీ.. : బాలీవుడ్ హీరోలపై కరణ్ జొహార్ విమర్శలు
- ఓపెనింగ్స్ కూడా రాబట్టలేని వాళ్లు కోట్లు అడుగుతున్నారని కరణ్ మండిపాటు
- చాలా మంది హీరోలు తామే స్టార్లు అనే భ్రమల్లో ఉంటారని విమర్శ
- తమ క్రేజ్ నుంచి కలెక్షన్లు వస్తాయనే భ్రమల నుంచి బయటపడాలని హితవు
సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం స్టార్ల రెమ్యునరేషన్ కే పోతోందని కరణ్ జొహార్ చెప్పారు. బాలీవుడ్ లో చాలా మంది హీరోలు తామే స్టార్లు అనే భ్రమలో ఉంటారని విమర్శించారు. బయట తమను చూసేందుకు జనాలు ఎగబడుతుండటంతో... అదే స్థాయిలో తమ సినిమాలకు కూడా ప్రేక్షకులు వస్తారని అనుకుంటుంటారని, అది సరికాదని చెప్పారు. తమ క్రేజ్ ని బట్టి కలెక్షన్లు వస్తాయనే భ్రమల నుంచి బయటపడాలని అన్నారు. ఓటీటీని దృష్టిలో పెట్టుకుని కొత్త యాక్టర్లను పరిచయం చేస్తే బాగుంటుందని చెప్పారు.