ఒంగోలు వేదికపై 'వీరసింహారెడ్డి' ట్రైలర్ రిలీజ్ .. ముహూర్తం ఖరారు!
- మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ గా 'వీరసింహారెడ్డి'
- రేపు రాత్రి ఒంగోలులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- భారీస్థాయిలో తరలిరానున్న అభిమానులు
- ఈ నెల 12వ తేదీన విడుదలవుతున్న సినిమా
అభిమానుల సమక్షంలో భారీ స్థాయిలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేదిక పై నుంచి ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆ రోజున రాత్రి 8:17 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ ఉంటుందని చెబుతూ, అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు.
కొంతమంది శత్రువులను మట్టి కరిపించి, మిగిలినవారి అంతుచూడటం కోసం ఆవేశంతో దూకుడుగా వస్తున్న 'వీరసింహారెడ్డి'ని ఈ పోస్టర్లో చూడొచ్చు. తమన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుంది. శ్రుతి హాసన్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, వరలక్ష్మి శరత్ కుమార్ కీలకమైన పాత్రను పోషిస్తోంది.