ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధ క్షేత్రం సియాచిన్ లో తొలి మహిళా ఆఫీసర్ నియామకం
- కుమార్ పోస్ట్ వద్ద శివ చౌహాన్ నియామకం
- ప్రకటించిన ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్
- సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలన్నది ఆమె అభిలాష
కఠోర శిక్షణ అనంతరం కుమార్ పోస్ట్ వద్ద శివ చౌహాన్ ను నియమించినట్టు ఫైర్ అండ్ ఫురీ కార్ప్స్ ట్విట్టర్ లో ప్రకటించింది. కెప్టెన్ శివ చౌహాన్ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. 11 ఏళ్ల వయసులో తండ్రి మరణించగా, తల్లి కుటుంబ బాధ్యతలు చేపట్టి, శివను చదివించింది. భారత సాయుధ దళాల్లో చేరి దేశానికి సేవలు అందించాలన్న అభిలాషతో ఆమె సైన్యంలో ప్రవేశం పొందారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రెయినింగ్ అకాడమీలో శిక్షణ పొందారు. అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు ప్రదర్శించడంతో సియాచిన్ లో బ్యాటిల్ స్కూల్ శిక్షణకు ఎంపికయ్యారు. దీన్ని సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని సియాచిన్ లోని ఓ పోస్ట్ వద్ద తాజాగా నియమితులయ్యారు.