Chandrababu: రేపటి నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన

Chandrababu will tour in Kuppam constituency for three days
  • సొంత నియోజకవర్గానికి వెళుతున్న చంద్రబాబు
  • ఈ నెల 6వ తేదీ వరకు పర్యటన
  • పలు గ్రామాల్లో పర్యటించనున్న టీడీపీ అధినేత
  • కుప్పంలో పార్టీ నేతలతో సమావేశం 
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు (జనవరి 4) కుప్పం పర్యటనకు వెళుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన మూడ్రోజుల పాటు సాగనుంది. 

రేపు ఉదయం 9.25 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఉదయం 11.20 గంటలకు బెంగళూరు ఎయిర్ పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మధ్యాహ్నం 2.30 గంటలకు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం పెద్దూరు గ్రామం చేరుకుంటారు. రాత్రి 8 గంటల వరకు శాంతిపురం మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తారు. 

ఈ నెల 5న కుప్పం టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. 

ఈ నెల 6న గూడుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. సాయంత్రం 6 గంటలకు పెద్దపర్తికుంట నుంచి బయల్దేరి బెంగళూరు హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
Chandrababu
Kuppam
TDP
Andhra Pradesh

More Telugu News