Sailaja Reddy: అదేమంటే చిరంజీవి పేరు చెబుతున్నారు... సీనియర్ నటుడు ప్రభాకర్ రెడ్డి కుమార్తె సంచలన వ్యాఖ్యలు

Prabhakar Reddy daughter Sailajareddy comments about Chitrapuri Coony
  • హైదరాబాదులో సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీ
  • ఇటీవలే ప్రారంభోత్సవం.. రిబ్బన్ కటింగ్ చేసిన చిరంజీవి
  • చిరంజీవి కంటే ముందే ఆసుపత్రి నిర్మించాలనుకున్నామన్న శైలజారెడ్డి
సినీ పరిశ్రమ కార్మికుల కోసం హైదరాబాదులో నిర్మించిన చిత్రపురి కాలనీ ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకుంది. మెగాస్టార్ చిరంజీవి రిబ్బన్ కటింగ్ చేశారు. చిత్రపురిలో ఆసుపత్రి నిర్మాణం కూడా జరగనుందని ఆయన తెలిపారు. కాగా, చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఆద్యుడు సీనియర్ నటుడు డాక్టర్ ఎం.ప్రభాకర్ రెడ్డి అని అందరికీ తెలిసిందే. ఆయన పేరు మీదే డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని నామకరణం చేశారు. 

అయితే, ప్రభాకర్ రెడ్డి కుమార్తె శైలజారెడ్డి సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాము చిత్రపురి కాలనీలో ఆసుపత్రి నిర్మాణానికి ఎప్పుడో నిర్ణయించామని, కానీ కొందరు చిరంజీవి పేరు చెబుతూ తమకు అడ్డుతగులుతున్నారని ఆమె ఆరోపించారు. చిరంజీవి ఇక్కడ ఆసుపత్రి నిర్మిస్తారంటూ ఆయన పేరు చెప్పి తమను వెనక్కి నెడుతున్నారని శైలజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

చిరంజీవి కంటే ముందే తాము ఆసుపత్రి నిర్మించాలని భావించామని తెలిపారు. అంతేకాదు, చిత్రపురి కాలనీ వ్యవస్థాపకుడు తన తండ్రి ప్రభాకర్ రెడ్డి అని, కానీ కాలనీ ప్రారంభోత్సవానికి తమ కుటుంబానికి ఎలాంటి ఆహ్వానం అందలేదని వెల్లడించారు. కమిటీకి ఫోన్ చేస్తే ఎవరూ స్పందించలేదని తెలిపారు.
Sailaja Reddy
Chitrapuri Colony
Prabhakar Reddy
Hospital
Chiranjeevi
Tollywood

More Telugu News