ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సీఎం స్టాలిన్ గుడ్ న్యూస్
- డీఏను 4 శాతం పెంచనున్నట్టు స్టాలిన్ ప్రకటన
- తాజా పెంపుతో 38 శాతానికి పెరిగిన డీఏ
- ప్రభుత్వ ఖజానాపై ప్రతి ఏటా రూ. 2,359 కోట్ల అదనపు భారం
మరోవైపు డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి యేటా రూ. 2,359 కోట్ల అదనపు భారం పడనుంది. పెరిగిన డీఏతో ఉద్యోగుల వేతనాలు రూ. 628 నుంచి రూ. 11 వేల వరకు పెరగనున్నాయి. మరోవైపు, పార్ట్ టైమ్ టీచర్లు చేస్తున్న డిమాండ్లను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు స్టాలిన్ ప్రకటించారు. ఈ కమిటీలో ఆర్థికశాఖ కార్యదర్శి, పాఠశాలల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ తదితరులు సభ్యులుగా ఉంటారని చెప్పారు.