హరిరామ జోగయ్య ‘కాపు’ రిజర్వేషన్ల సాధన దీక్ష భగ్నం.. ఏలూరు ఆసుపత్రికి తరలింపు
- కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు సిద్ధమైన హరిరామ జోగయ్య
- గత రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- తనకేదైనా జరిగితే జగన్‌దే బాధ్యతన్న హరిరామ జోగయ్య
మరోవైపు, రాత్రి దాదాపు 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న సుమారు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్సులోకి ఎక్కించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు ఓ వీడియో విడుదల చేసిన జోగయ్య.. 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్టు చెప్పానని, కానీ పోలీసుల తీరు కారణంగా తక్షణం దీక్ష ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. తనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, పోలీసులు కారణమవుతారని పేర్కొన్నారు.