ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది: రఘురామకృష్ణరాజు
- జగన్ ప్రభుత్వం కొత్త అప్పుల కోసం చూస్తోందన్న రఘురామ
- ప్రభుత్వ పథకాలకు తగినన్ని నిధులు లేవని వ్యాఖ్యలు
- ముందస్తు ఎన్నికలు తప్ప మరో మార్గం లేదని వెల్లడి
జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న జగన్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రతి విషయంలోనూ మాట తప్పడం ద్వారా జగన్ ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. ప్రజల పట్ల తన వైఖరి మార్చుకోవాలని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నట్టు రఘురామ తెలిపారు.