'వీరసింహారెడ్డి' నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ .. చూసేయండి!

Veera Simha Reddy Movie Making Video Release
షార్ట్స్‌లో చూడండి
బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'వీరసింహా రెడ్డి' సినిమా రూపొందింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సాగే మాస్ యాక్షన్ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, బాలయ్య సరసన శ్రుతి హాసన్ అలరించనుంది. తమన్ నుంచి వచ్చిన మాస్ బీట్స్ కి ఇప్పటికే అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని, ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం మేకింగ్ వీడియోను వదిలారు. బాలయ్య యాక్షన్ .. ఎమోషన్ .. సాంగ్ చిత్రీకరణకి సంబంధించిన సన్నివేశాల నేపథ్యంలోని బిట్స్ తో మేకింగ్ వీడియోను వదిలారు. షూటింగు చూడటానికి వచ్చిన బాలయ్య కుటుంబ సభ్యులు కూడా ఈ మేకింగ్ వీడియోలో కనిపిస్తున్నారు.  

బాలకృష్ణ ఇంతకుముందు చేసిన ఫ్యాక్షన్ సినిమాలు కొత్త రికార్డులు నమోదు చేశాయి. అందువలన సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమా, అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

Go Back to Shorts
Balakrishna
Sruthi Haasan
Thaman
Veerasimha Reddy Movie

More Telugu News