Dharmana Prasad: మాకు విశాఖను ఇచ్చేస్తే ఓ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం: ఏపీ మంత్రి ధర్మాన

Dharmana interesting comments on Uttarandhra
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఉత్తరాంధ్రలో తిరుగుతూ కూడా విపక్షనేత చంద్రబాబు అమరావతే రాజధాని అంటున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలు మన చేతులతో మన కళ్లను పొడిచే ప్రయత్నమే అని విమర్శించారు. అలాంటప్పుడు మాకు విశాఖను ఇచ్చేయండి... విశాఖ రాజధానిగా ఓ చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటాం అని అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా ధర్మాన... చంద్రబాబుపై ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అధికారమే పరమావధి అని, ప్రజల్లో ఏ మూలో సైకిల్ భావన ఉందని, సైకిల్ ను నమ్మి మోసపోవద్దని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రజాసంక్షేమాన్ని చూడలేకే చంద్రబాబు బాదుడే బాదుడు అంటూ తిరుగుతున్నాడని విమర్శించారు.
Go Back to Shorts
Dharmana Prasad
Visakhapatnam
Capital
YSRCP
Andhra Pradesh

More Telugu News