Vallabhaneni Janardhan: సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ మృతి

Tollywood actor director producer Vallabhaneni Janardhan passes away
  • అనారోగ్య సమస్యలతో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • ఈ ఉదయం 10.20 గంటలకు తుదిశ్వాస విడిచిన జనార్దన్
  • ఆయన వయసు 63 సంవత్సరాలు
తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. గత నాలుగు నెలల కాలంలో నలుగురు లెజెండరీలు కృష్ణంరాజు, కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు కన్నుమూశారు. ఇప్పుడు మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత వల్లభనేని జనార్దన్ మృతి చెందారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ ఈ ఉదయం 10.20 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 63 సంవత్సరాలు. 

ప్రముఖ దర్శకనిర్మాత విజయబాపినీడు మూడవ కుమార్తె లళినీ చౌదరిని ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కొడుకు కాగా, పెద్దమ్మాయి శ్వేత చిన్న వయసులోనే చనిపోయారు. రెండో కుమార్తె అభినయ ఫ్యాషన్ డిజైనర్ కాగా, కుమారుడు అవినాశ్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. జనార్దన్ మృతితో టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ఆయన మృతికి సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.
Vallabhaneni Janardhan
Tollywood
Dead

More Telugu News