జొమాటోలో ఒకే ఒక్కడు.. 3300 ఫుడ్ ఆర్డర్లు
- రోజుకు 9 ఆర్డర్లు ఇచ్చిన ఢిల్లీ వాసి
- ప్రోమో కోడ్ లతో ఎక్కువ ఆర్డర్లు ఇచ్చింది రాయ్ గంజ్ వాసులు
- ఆర్డర్ల పరంగా బిర్యానీ నంబర్ 1, పిజ్జా నంబర్ 2
జొమాటోలో ఈ ఏడాది ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి 3300 ఆర్డర్లు ఇచ్చి టాప్ కస్టమర్ గా నిలిచాడు. అంటే రోజుకు 9 ఆర్డర్లు ఇచ్చినట్టు అయింది. ఇక డిస్కౌంట్ ప్రోమో కోడ్ లను ఉపయోగించుకునే విషయంలో పశ్చిమబెంగాల్ లోని రాయ్ గంజ్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ 99.7 శాతం కస్టమర్లు డిస్కౌంట్ ప్రోమో కోడ్ తోనే ఈ ఏడాది ఆర్డర్ చేశారు.
ముంబైకి చెందిన ఓ కస్టమర్ ప్రోమో కోడ్ లను అప్లయ్ చేయడం ద్వారా ఈ ఏడాది జొమాటో ఆర్డర్లపై రూ.2.43 లక్షలను ఆదా చేసుకున్నాడు. బిర్యానీ తర్వాత జొమాటో యాప్ పై పిజ్జా కోసం ఎక్కువ మంది ఆర్డర్ చేశారు. ప్రతి నిమిషానికి 139 పిజ్జా ఆర్డర్లు వచ్చాయి.