అమెరికాలో మంచు తుపాను బీభత్సం... గుంటూరు జిల్లా దంపతుల విషాదాంతం
- అమెరికాలో బాంబ్ సైక్లోన్
- గడ్డకట్టించే చలి, పెద్ద ఎత్తున మంచు
- ఆరిజోనాలో గడ్డకట్టిన సరస్సు
- సరస్సును దాటే యత్నంలో మునిగిపోయిన హరిత, నారాయణ
సరస్సులో మునిగిపోయిన నారాయణ కోసం సహాయక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే ప్రమాదంలో ఏపీకి చెందిన మరో వ్యక్తి కూడా గల్లంతు కాగా, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
హరిత, నారాయణ స్వస్థలం గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం పాలపర్రు గ్రామం. వారిద్దరూ ఈ ఏడాది జూన్ లో స్వగ్రామానికి వచ్చారు. నిన్ననే కుటుంబ సభ్యులతో ఫోన్ లో కూడా మాట్లాడారు. అంతలోనే ఈ ఘోరం జరగడంతో వారి కుటుంబంలోనూ, గ్రామంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. హరిత, నారాయణ దంపతులకు ఇద్దరు సంతానం.