విద్యాసంస్థలు, థియేటర్లలో మాస్కులు తప్పనిసరి చేసిన కర్ణాటక ప్రభుత్వం
- భారత్ లో బీఎఫ్-7 కలకలం
- సబ్ వేరియంట్ నేపథ్యంలో నిపుణుల హెచ్చరికలు
- అప్రమత్తమైన రాష్ట్రాలు
- రాత్రి 1 గంట లోపే నూతన సంవత్సర వేడుకలు
- కర్ణాటకలో ఆదేశాలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పబ్ లు, రెస్టారెంట్లు, బార్లలో కచ్చితంగా మాస్కులు ధరించాలని, నూతన సంవత్సర వేడుకలు రాత్రి ఒంటి గంట లోపే ముగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వేడుకలు జరిగే చోట పరిమితికి మించి జనం గుమికూడరాదని అన్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని మంత్రి కేశవ సుధాకర్ తెలిపారు.