సరిహద్దు అంశంపై చైనా కీలక ప్రకటన
- సరిహద్దుల్లో సుస్థిరత కోసం భారత్ తో కలసి పనిచేస్తామని ప్రకటన
- దౌత్య, సైనిక మార్గాల్లో చర్చలు కొనసాగుతాయని వెల్లడి
- ప్రకటన విడుదల చేసిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
రెండు దేశాలు దౌత్య, సైనిక మార్గాల్లో సంప్రదింపులు చేసుకుంటున్నాయని, సరిహద్దు ప్రాంతాల్లో స్థిరత్వానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. రెండు దేశాల మధ్య ఈ నెల 20న 17వ కమాండర్ల స్థాయి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా సరిహద్దుల్లో స్థిరత్వాన్ని, భద్రతను కొనసాగించాలన్న అంగీకారం కుదిరింది. ఈ క్రమంలో చైనా విదేశాంగ మంత్రి ప్రకటన విడుదల చేయడం గమనార్హం.